ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌.. అక్క‌డ‌ తెల్లారే దాకా మ‌ద్యం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ (FIFA World Cup Finals) సంద‌ర్భంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ (Telangana Excise Department) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫైన‌ల్స్ మ్యాచ్‌కు మ‌ద్యం అమ్మ‌కాల స‌మ‌యాన్ని పొడిగించాల‌ని కోరుతూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓన‌ర్స్ అసోసియేష‌న్ చేసిన విజ్ఞప్తిని అంగీక‌రించింది. ఈ మేర‌కు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బార్లు, క్లబ్‌లు, మైక్రో బ్రూవరీలకు మద్యం సరఫరా చేసే పని వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ ఆదేశాల ప్రకారం జూలై 18న జరిగే థ‌ర్డ్ ప్లేస్‌ మ్యాచ్ సందర్భంగా శ‌నివారం అర్ధరాత్రి నుంచి 19వ తేదీ ఆదివారం తెల్ల‌వారుజామున‌ 4:30 గంటల వరకు, అలాగే జూలై 19న జరిగే ఫైనల్ (FIFA Finals) మ్యాచ్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి 20న సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ 3:00 గంటల వరకు పొడిగించిన సమయాల్లో మద్యం విక్రయించడానికి అనుమతి ఉంటుంది. పొడిగించిన వేళ‌ల్లో కూడా నిబంధనలన్నింటినీ కచ్చితంగా పాటిస్తూ నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ నిబంధనల అమలుకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, హైదరాబాద్, సికింద్రాబాద్, ఎల్‌బీ నగర్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జిల్లాల ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సైతం ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నది.

Read Also: బండి సంజయ్ కాన్వాయ్‌కు ప్ర‌మాదం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>