ఇది కొత్త డేటింగ్ గురూ.. సూపర్‌ మార్కెట్స్‌కి క్యూ కడుతున్న సింగిల్స్!

కలం, వెబ్ డెస్క్: డేటింగ్ యాప్‌లు, లింక్డ్‌ఇన్, రన్నింగ్ క్లబ్‌ల కాలం చెల్లిపోతోంది. ఇప్పుడు సింగిల్స్ ప్రేమ కోసం సరికొత్త వేదికను ఎంచుకుంటున్నారు. తమకు పరిచయమున్న స్థానిక కిరాణా దుకాణాన్నే ఎంచుకుంటున్నారు. కేవలం నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే సాధారణ ప్రదేశం కాస్తా, ఇప్పుడు పరిచయాలు పెంచుకుని బంధాలుగా మార్చుకునే వేదికగా మారుతోంది. దీనికి తాజా ఉదాహరణే ఫిన్లాండ్ (Finland) దేశంలోని సూపర్‌మార్కెట్లు. అక్కడ కొనుగోలుదారులు నలుపు, బూడిద రంగు బుట్టలకు బదులుగా గులాబీ రంగు (పింక్) షాపింగ్ బుట్టలను ఎంచుకుంటున్నారు. ఈ పింక్ బుట్టను పట్టుకుని తిరుగుతున్నారంటే ’నేను సింగిల్, ఎవరినైనా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను‘ అని స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నట్లే. ఈ సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వీక్షణలతో విపరీతంగా దూసుకుపోతోంది.

కిరాణా దుకాణాల్లో ప్రేమను వెతకడం ఇదే మొదటిసారి కాదు. దీనికంటే ముందే స్పెయిన్ సూపర్‌మార్కెట్లలో మరో వింత ట్రెండ్ వైరల్ అయింది. అక్కడ సింగిల్స్ తమ షాపింగ్ ట్రాలీలలో తలకిందులుగా ఉన్న అనాసపండును ఉంచి, తాము కొత్త పరిచయాల కోసం సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చేవారు. ఈ ట్రెండ్‌కు ప్రత్యేకంగా సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఒక డేటింగ్ అవర్ కూడా ఉండేది. ఆ సమయంలో యువతీ యువకులు కేవలం కబుర్లు చెప్పుకోవడానికి, ఒకరినొకరు కలుసుకోవడానికి సూపర్ మార్కెట్ కారిడార్లలో తిరిగేవారు. టిక్‌టాక్ వేదికగా మొదలైన ఈ సరదా ప్రయోగం, కిరాణా కొనుగోళ్ల సమయాన్ని కాస్తా మ్యాచ్‌మేకింగ్ వేడుకగా మార్చేసింది.

అసలు ప్రజలు సూపర్ మార్కెట్ల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే.. డేటింగ్ (Dating) యాప్‌ల వాడకం వల్ల కలిగిన విసుగు, అలసటే దీనికి ప్రధాన కారణం. నిరంతరం ప్రొఫైల్‌లను స్వైప్ చేయడం, కృత్రిమ ఆన్‌లైన్ మాటలు చాలామందిలో నిరాశను మిగిల్చాయి. అందుకే ఒత్తిడి లేని పరిచయాలను కోరుకుంటున్నారు. సూపర్‌మార్కెట్ వంటి ప్రదేశాల్లో సహజంగా సంభాషణ ప్రారంభించడానికి చక్కని వాతావరణాన్ని అందిస్తాయి.

భారతదేశంలో సైతం రన్నింగ్ క్లబ్‌లు, సైక్లింగ్ గ్రూపులు ఆఫ్‌లైన్ సామాజిక సమూహాల ద్వారా యువత ఒకరినొకరు కలుసుకుంటున్నారు. నిజమైన ప్రేమకథలు కేవలం ఒక స్వైప్‌తో కాకుండా, కిరాణా దుకాణంలోని పండ్లు, కూరగాయల మధ్య సహజంగా మొదలవుతున్నాయనేది స్పష్టమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>