తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి (Shiva Charan Reddy)కి ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) జాతీయ కమిటీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐవైసీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన ఒక సీనియర్ మహిళా నేతపై శివచరణ్ రెడ్డి అనుచిత భాషను ఉపయోగించారని, అలాగే వివిధ కులాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంపై కూడా అవమానకరమైన పదజాలాన్ని వాడారని ఈ నోటీసులో పేర్కొన్నారు. ఈ వివాదాస్పద ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన జాతీయ నాయకత్వం, ఈ నోటీసు అందిన రెండు రోజుల్లోగా రాతపూర్వకంగా తన వివరణను సమర్పించాలని ఆదేశించింది. మీపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే, పార్టీ నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఐవైసీ హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>